HOME » NEWS » politics » CHANDRABABU NAIDU NEW STRATEGY TO CHECKMATE BJP IN ANDHRA PRADESH MAY IRKS TDP AK GNT

Andhra Pradesh: బీజేపీకి చెక్.. చంద్రబాబు సరికొత్త వ్యూహం.. తేడా వస్తే మాత్రం..

Andhra Pradesh: బీజేపీతో పొత్తు కారణంగా గతంలోనే మైనార్టీ ఓట్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన ఓట్లను కోల్పోయామనే భావనలో ఉన్న టీడీపీ.. తాజా వ్యూహంతో మరోసారి ఆ వర్గాలను పూర్తిగా దూరం చేసుకునే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: January 13, 2021, 11:54 AM IST
Andhra Pradesh: బీజేపీకి చెక్.. చంద్రబాబు సరికొత్త వ్యూహం.. తేడా వస్తే మాత్రం..
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. సమయానికి తగ్గట్టుగా రాజకీయ నేతలు, పార్టీల వ్యూహాలు మారుతూ ఉంటాయి. కొత్త కొత్త నినాదాలు కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయన సరికొత్త వ్యూహం టీడీపీకి మైలేజీ ఇస్తుందా లేక మైనస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించే విషయంలో టీడీపీ చాలా దూకుడుగా ముందుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఈ అంశంలో బీజేపీని మించి ప్రభుత్వంపై విమర్శలు చేసింది టీడీపీ.

ఈ క్రమంలోనే చంద్రబాబు వైసీపీ అధినేత జగన్‌, ప్రభుత్వంపై చేసిన విమర్శలు.. క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన పలువురు క్రిస్టియన్ నేతలు రాజీనామా చేశారు. ఏకంగా టీడీపీ క్రిస్టియన్ సెల్ మొత్తం పార్టీకి రాజీనామా చేసిందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. అయితే రాబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి తమకు ముప్పు ఉందని భావిస్తుండటం వల్లే.. చంద్రబాబు ఈ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. హిందూత్వ నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించిన బీజేపీకి చెక్ చెప్పడంతో భాగంగానే టీడీపీ సైతం కొంతమేర హిందూత్వ వాదనను భుజాన వేసుకునేలా వ్యవహరిస్తోందనే ప్రచారం సాగుతోంది.

ఇలా చేయకపోతే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి తమకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని.. అదే జరిగితే ఆ తరువాత కూడా బీజేపీ నుంచి తిప్పలు తప్పవనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా ఏపీలో జరిగిన ఆలయాలపై దాడుల అంశంలో చంద్రబాబు దూకుడుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు అనుసరిస్తున్న ఈ వ్యూహం ఫలించడం వల్ల టీడీపీకి లభించే ప్రయోజనం పెద్దగా ఉండకపోయినప్పటికీ.. ఇది వికటిస్తే మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

బీజేపీతో పొత్తు కారణంగా గతంలోనే మైనార్టీ ఓట్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన ఓట్లను కోల్పోయిన టీడీపీ.. తాజా వ్యూహంతో మరోసారి ఆ వర్గాలను పూర్తిగా దూరం చేసుకునే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ విషయంలో చంద్రబాబు మరోసారి డైలమాలో పడిపోయారని.. మళ్లీ ఆచితూచి వ్యవహరించడం మొదలుపెట్టారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వైసీపీని ఎదుర్కోవడంతో పాటు తమ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్ చెప్పడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారిందనే చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: January 13, 2021, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading