ఏపీ అసెంబ్లీలో అరుదైన సీన్... సీఎం జగన్‌కు రెండు చేతులు ఎత్తి నమస్కరించిన చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 10:31 PM IST
ఏపీ అసెంబ్లీలో అరుదైన సీన్... సీఎం జగన్‌కు రెండు చేతులు ఎత్తి నమస్కరించిన చంద్రబాబు...
జగన్‌కు నమస్కారం చేస్తున్న చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఈ అరుదైన ఘటనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మారింది. రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. ‘అమరావతి కట్టడానికి డబ్బులు లేవని మరో చోటకు రాజధాని తరలించడం సరి కాదు. అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత డెవలప్ చేయడం కంటే మరోకొత్త సిటీని నిర్మించుకోవాలి. నాకు జగన్ మీద కోపం లేదు. బాధ లేదు. వారిని ఒకటే కోరుతున్నా. నా కంటే చిన్నవాడయినా రెండు చేతులు ఎత్తి మీక నమస్కారం పెడుతున్నా. ఆలోచించండి. తొందరపడొద్దు. మంచిది కాదు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. అభివృద్ధి కూడా జరగదు.’ అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నమస్కారం పెట్టినప్పుడు నవ్వుతున్న సీఎం జగన్


జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపకు రూ.1,450 కోట్లు ఇచ్చారని, అయితే, అందులో కొంత శ్రీకాకుళం, విజయనగరానికి ఇచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు అన్నారు. ఒక రాష్ట్రం - ఒకే రాజధాని టీడీపీ విధానం అని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారితే అంతం ఉండదన్నారు. బోస్టన్ రిపోర్ట్ అనేది బోగస్ రిపోర్ట్ అన్నారు.First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు