షాకింగ్... వైసీపీ ఎమ్మెల్యేతో చంద్రబాబు గుసగుసలు

విపక్ష నేత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెవిలో గుసగుసలాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: July 15, 2019, 2:58 PM IST
షాకింగ్... వైసీపీ ఎమ్మెల్యేతో చంద్రబాబు గుసగుసలు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ అసెంబ్లీలో ఒకరినొకరు విమర్శించుకోవడానికి అధికార టీడీపీ, విపక్ష వైసీపీ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆఫ్ ది రికార్డ్ సంభాషణలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ విపక్ష నాయకుడితో అధికార పార్టీ ఎమ్మెల్యే సంభాషించుకోవడం చాలా తక్కువ. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. విపక్ష నేత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెవిలో గుసగుసలాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనుల్లో కొంత మేర ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి ఇచ్చారని సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభలో వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డితో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు గుసగుసలాడారు. కాంట్రాక్టర్లకు పార్టీలు ఉండవని శ్రీధర్ రెడ్డితో చంద్రబాబు అన్నారు. మీ పార్టీలోనూ, మా పార్టీలోనూ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు అన్ని పార్టీల్లో ఉండటం సహజమే అని తెలిపారు. అయితే చంద్రబాబు మాటలకు స్పందించని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నవ్వి ఊరుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading