కోర్టులను తప్పుదారి పట్టిస్తున్న చంద్రబాబు... వైసీపీ

మా ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులకు టీడీపీ వ్యతిరేకం అయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరాలని సూచించారు.

news18-telugu
Updated: August 6, 2020, 9:38 PM IST
కోర్టులను తప్పుదారి పట్టిస్తున్న చంద్రబాబు... వైసీపీ
వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి
  • Share this:
అమరావతి రాజధానిలో రూ.52వేల కోట్లు ఖర్చు చేశామని టీడీపీ నేతలు కోర్టును సైతం తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. ఆ ఖర్చు ఎక్కడ చేశారో నిరూపించాలని సవాల్ చేశారు. ఎన్నికల ముందు రూ.52వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మళ్లీ మా ప్రభుత్వమే అధికారంలో వుంటుందని నమ్మించి, ఆ కాంట్రాక్టర్ల నుంచి దాదాపు రూ.5వేల కోట్లు ముడుపులు దండుకున్న విషయం వాస్తవం కాదా.. అని చంద్రబాబును పార్థసారథి ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతిని రియల్‌ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని, భూములు ఇచ్చిన రైతులకు కనీసం అన్ని వసతులతో ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదని అన్నారు. తన స్వలాభం కోసం 2వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకి, మరో 2వేల ఎకరాలు ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేశారని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదే భూమిని రూ.కోట్ల ధరలకు, ప్రైవేటు సంస్థలకైతే వారి నుంచి ముడుపులు తీసుకుని లక్షల ధరకు, అంతకన్నా తక్కువ ధరలకు భూములు కట్టబెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పోటీ వుండకూడదని గ్రీన్ జోన్‌ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయ నిష్ర్కమణకు చంద్రబాబు మార్గాలు వెతుక్కుంటున్నారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయ నిష్ర్కమణకు మార్గాలు వెతుక్కుంటున్నాడని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. తాజాగా మూడు రాజధానుల విషయంలో అధికారపక్షం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ మతిభ్రమించిన మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులకు టీడీపీ వ్యతిరేకం అయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌ విధానాలను వ్యతిరేకించిన వైఎస్‌ జగన్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజాతీర్పు కోరారని, అలాగే తెలంగాణ కోసం కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళారని గుర్తు చేశారు. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. దానికి భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని ఎలా అడుగుతారని అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 6, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading