గంటపాటు సాగిన రాహుల్,చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే ?

రాహుల్ గాంధీతో చంద్రబాబు (ఫైల్ ఫోటో)

రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు.

  • Share this:
    ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఆయన దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ, పొత్తులు,రీపోలింగ్ విషయంలో ఇద్దరూ చర్చించినట్టు సమాచారం.దాదాపు వీరిద్దరి భేటీ గంటపాటు కొనసాగింది. ముఖ్యంగా మే 23 తర్వాత పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు వెళ్తే మంచిదన్న అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరితో చంద్రబాబు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్‌ కార్యచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏపీ భవన్‌ నుంచి రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు. లోక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు... యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో ఆయనతో భేటీ కానున్నారు.
    First published: