ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు బెటర్... శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని పదవి విషయంలో రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంచి ప్రత్యామ్నాయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో రాహుల్ కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బెటర్ ఆప్షన్ అవుతారని అన్నారు.

news18-telugu
Updated: April 27, 2019, 2:05 PM IST
ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు బెటర్... శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీతో చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్సీపీ అధినేత, మాజీకేంద్రమంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని పదవి విషయంలో రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మేలు అని అన్నారు. ఈ విషయంలో రాహుల్ కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బెటర్ ఆప్షన్ అవుతారని అన్నారు. జీ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన శరద్ పవార్... ప్రస్తుతం దేశంలో ఎన్డీయేతర మహాకూటమి ఉందా ? అని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత ఎన్డీయేలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని శరద్ పవార్ అన్నారు.

ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎన్నికల తరువాత తమ కూటమిలోకి తీసుకొస్తామని పవార్ అన్నారు. 2004 ఎన్నికల తరువాత కూడా ఇదే జరిగిందని పవార్ గుర్తు చేశారు. అలా దేశానికి పదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని అన్నారు. దేశంలో మంచి నాయకులకు కొదవలేదన్న శరద్ పవార్... ఎన్నికల తరువాత వాళ్లు ఎవరన్నది డిసైడ్ చేస్తామని అన్నారు. ఇప్పుడే ఎవరో ఒకరి పేరు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల తరువాత బీజేపీయేతర పక్షాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి పని చేస్తాయని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 27, 2019, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading