వైసీపీ మరో లేఖ.. చంద్రబాబు భయపడతారా? దూసుకెళ్తారా?

ప్రభుత్వం కేటాయించిన గెస్ట్ హౌస్‌ను పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించడం ద్వారా చంద్రబాబునాయుడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీకి లేఖ రాశారు.

news18-telugu
Updated: April 21, 2019, 8:11 PM IST
వైసీపీ మరో లేఖ.. చంద్రబాబు భయపడతారా? దూసుకెళ్తారా?
చంద్రబాబు, జగన్(File)
news18-telugu
Updated: April 21, 2019, 8:11 PM IST
ఏపీలో ఎన్నికల కమిషన్, చంద్రబాబునాయుడు, వైసీపీ మధ్య రసవత్తరంగా ఫైట్ నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ వైసీపీ.. ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్.. రాష్ట్ర అధికారులకు తలంటుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ మరో కొత్త లేఖను సంధించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న సారాంశం ప్రకారం.. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని, వనరులను పార్టీ కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి వీలు లేదు. అయితే, చంద్రబాబునాయుడు మాత్రం ప్రభుత్వం కేటాయించిన గెస్ట్ హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్ష నిర్వహించాలని చూస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగాన్ని, వనరులను వినియోగించుకోవాలంటే అందుకు ఈసీ అనుమతి తీసుకోవాలి. మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో లేదో? మాకు తెలియదు. దయచేసి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోగలరు.’ అంటూ విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.

ఈసీకి విజయసాయిరెడ్డి రాసిన లేఖ


రాష్ట్రంలో ఈనెల 11న జరిగిన ఎన్నికల సరళి మీద సమీక్ష జరిపేందుకు చంద్రబాబునాయుడు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అందరినీ భేటీకి పిలిచారు. ఈ భేటీని ప్రభుత్వం ఇచ్చిన గెస్ట్ హౌస్‌లో నిర్వహించాలని ప్లాన్ చేయడంపై ఇప్పుడు వైసీపీ లేఖ రాసింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏం చేస్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈసీతో ఢీ అంటే ఢీ అంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా దూసుకెళ్తారా? లేకపోతే ఎందుకొచ్చిన గొడవలే అని సమీక్షను పార్టీ ఆఫీసుకి మారుస్తారా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...