ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల మీద అసెంబ్లీలో చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతుండగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ‘అబ్జక్షన్’ అన్నారు. దీంతో సీఎం మరింత సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో బీజేపీ నేతల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఫైర్ కావడంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీరియస్ అయ్యారు.
నల్ల చొక్కాలో చంద్రబాబునాయుడు
చంద్రబాబునాయుడు బాగా అసహనంతో ఉన్నారని జీవీఎల్ నరసింహారావు అన్నారు. అందుకే తమ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పైడి కొండలరావులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యల ద్వారా టీడీపీ ఆగడాలను బయటపెట్టనివ్వకుండా ఆపలేరన్నారు. చంద్రబాబు మీద ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్" కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ" లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన.https://t.co/Py3PTKon91
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.