వైఎస్ షర్మిలపై చంద్రబాబు హాట్ కామెంట్స్.. ఆస్తులపై కీలక వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి మీద ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి మీద ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కర్నూలులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ మీద నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా తెలంగాణలో రోడ్డున పడేశారని ఆరోపించారు. జగన్ షర్మిలను మోసం చేశారన్నారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు వరుసగా ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. కర్నూలు, ప్రకాశం, విశాఖ సహా పలు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ క్రమంలో జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అలాగే, వైఎస్ వివేకా హత్య కేసును కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసన్నారు.

  షర్మిల.. ఏప్రిల్ 9న తన పార్టీ పేరును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతకంటే ముందే వివిధ జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో సమావేశమవుతున్న షర్మిల... తన కొత్త పార్టీ ఎలా ఉండాలనే దానిపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాలపై ఏ రకమైన ప్రభావం చూపిస్తుందనే అంశంపై అనేక విశ్లేషణులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నా.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేరకు రాణిస్తుందనే అంశంపై మాత్రం చాలామంది నాయకుల్లో సందేహాలు నెలకొన్నాయి.

  ఈ కారణంగానే చాలామంది నాయకులు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. అయితే తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలోకి నేతలు వచ్చేలా చేయడంలో తెరవెనుక బాధ్యతలను ఆమె తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో వైఎస్ఆర్‌తో పాటు వైసీపీలో పని చేసిన అనేక మంది నేతలకు విజయమ్మ ఫోన్ చేసిన ఈ అంశంపై మాట్లాడారని తెలుస్తోంది. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలని.. ఆమె పెట్టబోయే కొత్త పార్టీలో చేరాలని విజయమ్మ కొందరు నేతలను ఫోన్ చేసిన కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ముఖ్యనేత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతకుముందు తన తల్లి విజయమ్మ ఆశీస్సులు మద్దతు తనకు ఉన్నాయని కొద్దిరోజులు క్రితం షర్మిల ప్రకటించారు. అయితే తన సోదరుడు జగన్‌కు తాను పార్టీ పెట్టడం ఇష్టంలేదని షర్మిల బాహాటంగానే ప్రకటించారు. అయితే విజయమ్మ షర్మిల రాజకీయ ఎదుగుదల కోసం ఇంతగా శ్రమిస్తున్నారని మాత్రం ఎవరూ ఊహించలేదు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: