ఓటమికి కారణాలు తెలియని పరిస్థితి... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా ఓటమికి కారణాలు అన్వేషించడంతో పాటు ఒక్కో నియోజకర్గంలో ఓటమికి గల కారణాలను తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.

news18-telugu
Updated: June 14, 2019, 1:17 PM IST
ఓటమికి కారణాలు తెలియని పరిస్థితి... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: June 14, 2019, 1:17 PM IST
టీడీపీ అధినేత, ఏపీ మాజీమంత్రి చంద్రబాబు టీడీపీ వర్క్ షాప్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటమికి కారణాలు కనిపించేవన్న చంద్రబాబు... ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓటమికి కారణాలు కూడా కనిపించని పరిస్థితి ఉందని చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... అభివృద్ధి, సంక్షేమంలో ఏ లోటు లేకుండా చేశామని చంద్రబాబు అన్నారు. అయినా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయంపై నేతలు క్షేత్రస్థాయి నుంచి సమీక్షలు చేసుకోవాలని సూచించారు.

గుంటూరులో జరిగిన పార్టీ వర్క్ షాప్ సమావేశంలో గెలిచిన నేతలతో పాటు ఎన్నికల్లో ఓడిన నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సమావేవంలో మాట్లాడిన చంద్రబాబు... ఎన్నికల్లో ఓటమి చెందినా... ఈ సారి పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటమికి కారణాలు అన్వేషించడంతో పాటు ఒక్కో నియోజకర్గంలో ఓటమికి గల కారణాలను తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని... మూడు వారాల్లోనే వందకు పైగా దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలంతా కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు.First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...