కోడెలను అవమానించిన చంద్రబాబు... అంబటి సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజుల క్రితమే కోడెల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యారని... దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.

news18-telugu
Updated: September 17, 2019, 5:34 PM IST
కోడెలను అవమానించిన చంద్రబాబు... అంబటి సంచలన వ్యాఖ్యలు
కోడెల, అంబటి
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వెనుక మిస్టరీ ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల ఆత్మహత్యకు ఏపీ సీఎం జగన్ కారణమని చంద్రబాబు ఆరోపించడాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తాము బలంగా నమ్ముతున్నామని ఆయన ఆరోపించారు. కోడెల ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కోడెలను కష్టకాలంలో చంద్రబాబు పక్కనపెట్టారని అంబటి వ్యాఖ్యానించారు.

కొద్దిరోజుల క్రితమే కోడెల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యారని... దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. కోడెల ఆస్పత్రిలో వారం రోజులు ఉంటే... చంద్రబాబు కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని అంబటి అన్నారు. కోడెల అల్లుడిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా ? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పల్నాటి పులిలా బతికిన కోడెల శివప్రసాదరావుకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేకుండా చేసింది చంద్రబాబే అని ఆరోపించారు.

కోడెలపై కేసులు పెట్టింది టీడీపీలోని ఆయన బాధితులే అని... అయినా ఆ కేసుల నుంచి అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన స్టే తెచ్చుకున్నారని అంబటి గుర్తు చేశారు. ఒక్క కేసులోనూ కోడెలను అరెస్ట్ చేయలేదని తెలిపారు. తాము కోడెల శివప్రసాదరావు ప్రత్యర్థి పార్టీలో ఉన్నామని... ఆయనను తాము విమర్శించడంలో వింతేమీ లేదని అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading