news18-telugu
Updated: January 4, 2019, 11:30 AM IST
చంద్రబాబు నాయుడు, జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
ఏపీ సీఎం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన జీవీఎల్...నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఇలా చిల్లర రాజకీయాలు చేస్తుంటే నమ్మబుద్ధికావడం లేదన్నారు. పొత్తున లేచిన దగ్గర నుంచి చంద్రబాబు మోదీ నామం జపిస్తున్నారని విమమర్శించారు. మోడీ నామ జపం చేయనిదే చంద్రబాబుకు పూట గడవడం లేదన్నారు. మోదీ కోటి రాసుకుంటే చంద్రబాబుకు పుణ్యమన్నా దక్కేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి దానికీ ప్రధాని మోదీని నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దావోస్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తిప్పికొట్టారు.
దేశంలో మోదీ ఫోబియా ఎక్కువగా పట్టుకున్న వారిలో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో రూ.500 కోట్లు ఇచ్చి, రెండు సీట్లు గెలిచి జబ్బలు చరుచుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ...రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. హైకోర్టుకు రెండంతస్థుల భవనం కట్టలేని చేతగాని ప్రభుత్వం చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. టీడీపీ అబద్ధాలను, తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని జీవీఎల్ అన్నారు.
First published:
January 4, 2019, 11:26 AM IST