చంద్రబాబు ఇంటి వద్ద మంత్రులకు చుక్కెదురు..

చంద్రబాబు ఇంటిలోకి మంత్రులను అనుమతించొద్దని తెలుగుదేశం నేతలు చెప్పారంటూ చెక్ పోస్టు వద్దే మంత్రులను భద్రతా సిబ్బంది నిలిపివేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 7:51 PM IST
చంద్రబాబు ఇంటి వద్ద మంత్రులకు చుక్కెదురు..
చంద్రబాబు ఇంటి వద్ద మంత్రులను నిలిపివేసిన భద్రతా సిబ్బంది
  • Share this:
విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద మరోసారి హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మంత్రులు లోపలకు వెళ్లొద్దంటూ చెక్ పోస్ట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. మంత్రులను లోపలికి వదలొద్దని టీడీపీ నేతలు చెప్పారంటూ మంత్రులకు సమాధానం చెప్పారు భద్రతా సిబ్బంది. దీంతో మంత్రులను ఎలా అడ్డుకుంటారని.. టీడీపీ వాళ్లు తప్పు చేస్తున్నారంటూ అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని అంచనా వేయడానికి వచ్చిన మంత్రులను ఎలా అడ్డుకుంటారంటూ మండిపడ్డారు. అదే సమయంలో మంత్రుల రాకను నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్, వర్ల రామయ్య నినాదాలు చేశారు. మంత్రులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు