Home /News /politics /

CHANDRABABU NAIDU HITS BJP AND YSRCP WITH HIS NEW PLAN AK

చంద్రబాబు వ్యూహం... ఒకే దెబ్బకు రెండు పిట్టలు

చంద్రబాబు

చంద్రబాబు

తన సరికొత్త వ్యూహంతో చంద్రబాబు అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీని కూడా దెబ్బకొట్టారని టాక్ వినిపిస్తోంది.

    చలో ఆత్మకూరు అంటూ తమ పార్టీకి చెందిన వైసీపీ బాధితులను వారి ఊళ్లలోకి తీసుకెళ్లే పని మొదలుపెట్టిన టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు... వైసీపీపై రాజకీయ దాడిని ముమ్మరం చేశారు. కొంతకాలంగా నుంచి సైలెంట్ ఉన్న టీడీపీ శ్రేణులను తన కొత్త రాజకీయ వ్యూహం ద్వారా యాక్టివ్ చేయడంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ దాడులు చేస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చలో ఆత్మకూరు ద్వారా చంద్రబాబు ఎంతో కొంత విజయం సాధించారని చెప్పకతప్పదు. తమ రాజకీయ కార్యాచరణ ద్వారా వైసీపీని కొంతమేర ఆత్మరక్షణలో పడేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది.

    అయితే చలో ఆత్మకూరు ద్వారా చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేశారనే విషయం బయటకు కనిపిస్తున్నా... అంతర్లీనంగా మాత్రం ఆయన బీజేపీకి కూడా చెక్ చెప్పే ప్రయత్నం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల తరువాత టీడీపీ కాస్త స్తబ్దుగా ఉండటంతో... ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూశారనే టాక్ ఉంది. పార్టీని మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి తీసుకురావడం...రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీనే అనే అంశాన్ని చలో ఆత్మకూరు ద్వారా మరోసారి పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు.

    ఈ రకమైన రాజకీయ దూకుడు కొనసాగిస్తే... టీడీపీ నేతలు బీజేపీ వైపు వెళ్లే విషయంలో పునరాలోచనలో పడతారన్నది చంద్రబాబు వ్యూహమని పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో కేవలం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప... రాజకీయ కార్యాచరణ విషయంలో బీజేపీకి ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. మొత్తానికి చలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా చంద్రబాబు పత్యక్షంగా వైసీపీని, పరోక్షంగా బీజేపీని దెబ్బకొట్టారని అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Chalo athmakuru, Chandrababu naidu, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు