• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CHANDRABABU NAIDU HAVE TO LEAD TDP IN ASSEMBLY IN THE ABSENCE OF ATCHANNAIDU AND KARANAM BALARAM AK

టీడీపీకి పెద్ద కష్టం.. చంద్రబాబుపైనే భారం..

టీడీపీకి పెద్ద కష్టం.. చంద్రబాబుపైనే భారం..

వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పది రోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన పార్టీ సీనియర్ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచినా... వారిలో ఎక్కువమంది అసెంబ్లీలో మౌనంగా ఉంటున్నారు.

  • Share this:
    ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ... అధికార వైసీపీని సవాల్ చేయడంలో ఇప్పటివరకు బాగానే సక్సెస్ అవుతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణంగా ఆ పార్టీ తరపున గెలిచిన కొందరు నేతల వాయిస్ బలంగా ఉండటమే. వారిలో మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కరణం బలరాం వంటి వాళ్లు ఉండేవారు. వారి తరువాత నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి వంటి వారు సైతం వైసీపీపై రాజకీయ దాడి చేయడంతో పాటు తమపై జరిగే రాజకీయ దాడిని ఎదుర్కోవడంలో కొంతవరకు విజయం సాధించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, కరణం బలరాం లేకుండా పోయారు. అచ్చెన్నాయుడు అవినీతి కేసుల్లో అరెస్ట్ కాగా, కరణం బలరాం అధికార పార్టీకి జై కొట్టారు.

    దీంతో టీడీపీ తరపున అసెంబ్లీ వాయిస్ వినిపించే బాధ్యతంతా చంద్రబాబుపైనే ఉందనే టాక్ వినిపిస్తోంది. నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు ఉన్నా... వారంతా వైసీపీని ఏ మేరకు ఎదుర్కొంటారనే దానిపై స్పష్టత లేదు. నిజానికి టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచినా... వారిలో ఎక్కువమంది అసెంబ్లీలో మౌనంగా ఉంటున్నారు. చంద్రబాబు సహా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రం అధికార వైసీపీని ఎదుర్కొంటూ వచ్చారు. తాజాగా అచ్చెన్నాయుడు, కరణం బలరాం సపోర్ట్ టీడీపీకి లేకపోవడంతో... ఈసారి ఆ పార్టీ తరపున అధికార వైసీపీని ఎదుర్కొనే భారమంతా చంద్రబాబుపైనే ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: