సీఎం జగన్ నిర్ణయం... చంద్రబాబు హ్యాపీ ?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీ వైపు కాకుండా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: October 7, 2019, 4:33 PM IST
సీఎం జగన్ నిర్ణయం... చంద్రబాబు హ్యాపీ ?
జగన్, చంద్రబాబు
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే మెజార్టీ నిర్ణయాలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యతిరేకిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల వైసీపీలో జరిగిన ఓ పరిణామం మాత్రం చంద్రబాబుకు రిలీఫ్ ఇచ్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన తోడల్లుడు, సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... టీడీపీతో పాటు చంద్రబాబుకు కూడా ఊరట కలిగించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన రావి రామనాథంబాబును తిరిగి పార్టీలోకి చేర్చుకుంది అధికార పార్టీ. అయితే రామనాథంబాబు చేరిక విషయంపై డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కనీస సమాచారం ఇచ్చారా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడంతో రామనాథంబాబు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌సమక్షంలో పార్టీలో చేరడం ఆసక్తిరేపుతోంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌దగ్గుబాటి కానీ, ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ కానీ కనిపించలేదు. దీంతో దగ్గుబాటికి చెక్ చెప్పేందుకే రామనాథంబాబును మళ్లీ పార్టీలోకి తీసుకున్నారనే గుసగుసలు మొదలయ్యాయి.

daggubati venkateshwara rao, daggubati venkateshwara rao ignored by ysrcp, daggubati venkateshwara rao ignored by ap cm ys jagan, chandrababu happy with cm jagan decision, ys jagan sidelined daggubati venkateshwara rao, ysrcp left daggubati family, daggubati purandeswari, Hitesh chenchuram, ysrcp, ycp, bjp, parchuru, chandrababu naidu, tdp, ap latest news, ap politics, Ap cm ys jagan, ramanatham babu, prakasam district, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, హితేష్, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్, పర్చూరు, టీడీపీ, వైసీపీ, ప్రకాశం జిల్లా, ఏపీ న్యూస్
దగ్గుబాటి వెంకటేశ్వరరావు(File)


మరోవైపు ఎన్నికల తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీ వైపు కాకుండా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇది కూడా వైసీపీ నాయకత్వానికి దగ్గుబాటిపై నమ్మకం తగ్గడానికి ఓ కారణమై ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు అన్ని రకాలుగా ఎదురుచూసే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీకి వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం టీడీపీ అధినేతకు ఒకరకంగా సంతోషం కలిగించే అంశమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: October 7, 2019, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading