రైతులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.10 వేలు కాదు రూ15,000... రేపట్నుంచే ఖాతాల్లో జమ?

అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇస్తామన్న రూ.10,000 సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఏడాదికి రూ.15,000 సాయం చేస్తామని జీవో జారీ చేసింది.

news18-telugu
Updated: February 17, 2019, 4:16 PM IST
రైతులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.10 వేలు కాదు రూ15,000... రేపట్నుంచే ఖాతాల్లో జమ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. మొన్నటి వరకు ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.10,000 ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సాయాన్ని రూ.15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన డబ్బులు రేపట్నుంచి (సోమవారం) జమ అయ్యే అవకాశం ఉంది. అందరికీ ఒకేసారి డబ్బులు జమ కాకపోయినా.. తొలుత కొంతమంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం చేయనుంది. దీని కోసం బడ్జెట్‌లో రూ.5000 కోట్లు ప్రతిపాదించింది.

annadata sukhibhava, annadata sukhibhava Farmers, Financial assistance to Farmers, AP Farmers, Rs.1000 per Farmer Family, Rs.15,000 per year, చంద్రబాబునాయుడు, ఏపీ ప్రభుత్వం రైతు స్కీమ్, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ సాయం రూ.10000, అన్నదాత సుఖీభవ సాయం రూ.15000, రైతులకు ఏపీ సర్కారు సాయం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం, ఏపీ ప్రభుత్వం రైతుబంధు
ప్రతీకాత్మక చిత్రం


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6000 డబ్బులు ఇస్తారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. రూ.2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం మూడు విడుతల్లో ఆ నిధులు అందజేస్తుంది. ఈ నెలలోనే తొలివిడుత రూ.2000 జమ అయ్యే అవకాశం ఉంది. ఆ రూ.2000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.3000 కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.

annadata sukhibhava, annadata sukhibhava Farmers, Financial assistance to Farmers, AP Farmers, Rs.1000 per Farmer Family, Rs.15,000 per year, చంద్రబాబునాయుడు, ఏపీ ప్రభుత్వం రైతు స్కీమ్, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ సాయం రూ.10000, అన్నదాత సుఖీభవ సాయం రూ.15000, రైతులకు ఏపీ సర్కారు సాయం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం, ఏపీ ప్రభుత్వం రైతుబంధు
చంద్రబాబు నాయుడు (File)


దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘పీఎం కిసాన్’ పథకం ప్రకారం రెండు హెక్టార్ల (సుమారు ఐదు ఎకరాలు) లోపు వ్యవసాయ భూమి ఉన్నవారే అర్హులు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్నవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది. వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు. మొత్తం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది.

PM modi and BJP planning to implement better scheme than farm loan waive off for farmers రుణమాఫీ కాదు... అంతకుమించి ఆలోచిస్తున్న మోదీ వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం ద్వారా బీజేపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో మైలేజీ ఉంటుందా లేదా అనే అంశంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరుపుతోంది. మరోవైపు రుణమాఫీ కంటే మరో రకంగా రైతులకు మేలు చేసే పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం, ప్రధాని నరేంద్రమోదీ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000 పొందే వారికి రాష్ట్రం నుంచి మరో రూ.9,000 సాయం అందుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిధిలో లేని వారికి రూ.10,000 సాయం అందించాలని  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 17, 2019, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading