• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • CHANDRABABU NAIDU GOT APPROVAL FROM AP DGP TO VISIT ANDHRA PRADESH BA

చంద్రబాబు అప్లికేషన్‌కు ఏపీ సర్కార్ అప్రూవల్...

చంద్రబాబు(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పెట్టుకున్న దరఖాస్తుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పెట్టుకున్న దరఖాస్తుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా మార్చి 20 నుంచి హైదరాబాద్‌ నివాసంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు అనుమతి కోరారు. తెలంగాణ డీజీపీ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఏపీ డీజీపీ కార్యాలయం కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పర్యటనకు రూట్ క్లియర్ అయింది. రేపు (మే 25) ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళ్తారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను వెంకటాపురం గ్రామంలో పరామర్శిస్తారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. సాయంత్రం రోడ్డుమార్గంలో చంద్రబాబు అమరావతి నివాసానికి చేరుకుంటారు.

    చంద్రబాబునాయుడుకు ఏపీ డీజీపీ అనుమతి
    Published by:Ashok Kumar Bonepalli
    First published: