CHANDRABABU NAIDU FLOOD MANAGEMENT KNOWN TO EVERYONE SLAMS AP MINISTER ANIL KUMAR YADAV AK
Andhra Pradesh: చంద్రబాబులా చేయలేము.. కేసీఆర్ చేశారని అంటారేమో.. ఏపీ మంత్రి సెటైర్లు
చంద్రబాబునాయుడు (FIle)
AP Minister Anil Kumar Yadav: చంద్రబాబులాగా మీడియా కవరేజ్, డూప్ కవరేజ్ కోసమే గంటగంటకి మీడియా సమావేశం పెట్టి, అధికారులను వారి పనిచేయనివ్వకుండా ఉండే ప్రభుత్వం తమది కాదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఏపీకి టూరిస్ట్‌లు చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఆరు నెలల నుంచి రెండు నెలలకి ఒకసారి రాష్ట్రానికి వచ్చిపోతారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని విమర్శించారు. రివ్యూలతో ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులను కుర్చొపెట్టి చెప్పిందే చెప్పి విసిగించే ప్రభుత్వం తమది కాదని.. రాష్ట్రంలో అధికార యంత్రాంగం తమపని తాము చేస్తోంది. అధికారులందరూ శ్రీశైలం నుంచి కింద వరకు ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేస్తున్నారని మంత్రి అనిల్ తెలిపారు. వర్షాలు పడి, డ్యామ్‌లు నిండుతుంటే ఏడుపుతో చంద్రబాబు బాధ పడుతున్నాడని ఆరోపించారు.
1998లో శ్రీశైలంకు వరద వచ్చినప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ మేధావి చంద్రబాబు పవర్ ప్లాంట్‌ను ముంచిన మాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. సంవత్సరం పాటు పవర్ ప్లాంట్ ఆపరేషన్లోకి రాకుండా పోయింది కూడా వాస్తవం అని అన్నారు. గత గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మేనేజ్ మెంట్ చూశామని.. 29 మంది చనిపోయారని మంత్రి అనిల్ అన్నారు. అటువంటి మేనేజ్ మెంట్లు మాకు చేతకావని అన్నారు. మీడియా అటెన్షన్ కోసం బోయపాటి, రాజమౌళిలను తీసుకురాలేమని అన్నారు.
మంత్రి అనిల్ కుమార్
చంద్రబాబు హైదరాబాద్‌లో ఆరు నెలలు తిష్ట వేశాడని.. అంతే ఆయన పాదమహిమ వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తాను ఇక్కడ ఉన్నాను కాబట్టే కేసీఆర్ చెరువుగట్లు తెగ్గొట్టి వరదలు వచ్చేలా చేశాడని చెప్పినా చెప్పే మహానుభావుడు చంద్రబాబు అని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రస్టేషన్ రాష్ట్ర ప్రజలందరికి అర్ధం అవుతోందని అన్నారు. బయటకు వస్తే ఎన్నో ఇబ్బందులు ఇంటిదగ్గరే ఉండి జూమ్‌కి పరిమితమైపోయారని అన్నారు. కొడుకు ఇంకో నాలుగురోజులు మీటింగులు పెట్టి తిరిగితే పార్టీ ఏమైపోతుందన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు తుపాన్లను రావద్దని ఏమైనా ఆపాడా ? ఆయన ఉన్నపుడే తిత్లీ, హుద్ హుద్ లాంటి తుఫాన్లు వచ్చాయని మంత్రి అనిల్ అన్నారు. అప్పుడు కూడా నష్టం జరిగిందని అన్నారు. చంద్రబాబులాగా మీడియా కవరేజ్, డూప్ కవరేజ్ కోసమే గంటగంటకి మీడియా సమావేశం పెట్టి, అధికారులను వారి పనిచేయనివ్వకుండా ఉండే ప్రభుత్వం తమది కాదని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.