కరోనా సమయంలో ఇలా చేస్తారా ?... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై మండిపడ్డ చంద్రబాబు

విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నాయుడి పేరు లేదన్న చంద్రబాబు...అచ్చెన్నాయుడు కుటుంబం ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుండటం వల్లే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: June 12, 2020, 5:45 PM IST
కరోనా సమయంలో ఇలా చేస్తారా ?... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై మండిపడ్డ చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే అని టీడీపీ అధినేత విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని.. సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా అని ప్రశ్నించారు.
  • Share this:
టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తున్నామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కరోనా సమయంలో 300 మంది పోలీసులతో అచ్చెన్నాయుడు ఇంటికి వెళతారా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. కనీసం మాస్క్ వేసుకోకుండా పోలీసులు గోడ దూకి అచ్చెన్నను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇటీవల ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఈకరంగా అరెస్ట్ చేస్తారా ? అని మండిపడ్డారు. కనీసం ఆయన భార్యకు కూడా సమాచారం ఇవ్వకుండా తరలించారని చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడెక్కడో తిప్పి... విజయవాడకు తీసుకొచ్చారని అన్నారు. అచ్చెన్నాయుడు విచారణకు రానని చెప్పారా ? ఎందుకు అరెస్ట్ చేశారని చంద్రబాబు నిలదీశారు.

విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నాయుడి పేరు లేదన్న చంద్రబాబు...అచ్చెన్నాయుడు కుటుంబం ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుండటం వల్లే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ సుధాకర్ విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి అరాచకాలకు ప్రభుత్వం పాల్పడుతోందని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్ట ఉల్లంఘనలు చేసి అచ్చెన్నాయుడును బలి పశువు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Published by: Kishore Akkaladevi
First published: June 12, 2020, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading