వివేకా కేసుకే దిక్కులేదు... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

జగన్‌ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని... ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

news18-telugu
Updated: October 14, 2019, 5:12 PM IST
వివేకా కేసుకే దిక్కులేదు... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
  • Share this:
వైఎస్ వివేకానందరెడ్డిని సుపారీ హత్య చేస్తే విచారణకు దిక్కులేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... సీఎం జగన్, వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని... ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు.వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారన్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెలను వేధించి చంపారని ధ్వజమెత్తారు.

రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను జీవితాంతం జైలులో పెట్టినా చాలదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు.కొంతమంది పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. స్టిక్కర్ల మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. నిజాయితీపరులైన పోలీసులు సెలవుపై వెళ్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌తో జైలుకు వెళ్లినవారికి ఉన్నత పదవులు ఇచ్చారని మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించేవారిలో తాను ముందుంటానని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు.

First published: October 14, 2019, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading