వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పెద్ద రౌడీ అయితే, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చిన్న రౌడీ అని మండిపడ్డారు. చిన్న చిన్న రౌడీలను చాలా మందిని చూశానన్న చంద్రబాబు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై చెవిరెడ్డి దాడులకు దిగడం దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చంద్రబాబు తెలిపారు. పులివెందులలో జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పండ్ల తోటల రైతుల వద్ద పన్ను వసూలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తొలిసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1978లో చంద్రగిరిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.