దగ్గుబాటి, ఆమంచిపై పోటీ చేయబోయే టీడీపీ నేతలు...

చీరాల బరిలో ఆమంచి కృష్ణమోహన్ మీద కరణం బలరాం మీద పోటీ చేయడానికి అవకాశం ఉంది. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం మీద పోటీకి ఏలూరు సాంబశివరావు పేరును ప్రతిపాదిస్తున్నారు.

news18-telugu
Updated: February 23, 2019, 10:04 PM IST
దగ్గుబాటి, ఆమంచిపై పోటీ చేయబోయే టీడీపీ నేతలు...
చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు
  • Share this:
బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. బాపట్ల ఎంపీగా శ్రీరామ్ మాల్యాద్రి మరోసారి పోటీ చేయనున్నారు. అద్దంకి అసెంబ్లీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి టికెట్ ఖరారు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటి రవికి టికెట్ ఖాయమైంది. పర్చూరులో ఏలూరు సాంబశివరావు పేరును చంద్రబాబు ఓకే చేశారు. రేపల్లె ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్, వేమూరు నుంచి నుంచి మళ్లీ నక్కా ఆనంద్ బాబును దించాలని డిసైడ్ అయ్యారు. బాపట్ల అసెంబ్లీ, సంతనూతలపాడు, చీరాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బాపట్ల టికెట్‌ను అన్నం సతీష్‌కు ఇవ్వడానికి దాదాపు సిద్ధమైనట్టు తెలిసింది. సంతనూతలపాడులో విజయ్ కుమార్ పేరు, చీరాలకు కరణం బలరాం పేరును ప్రతిపాదిస్తున్నారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆమంచి కృష్ణమోహన్‌పై కరణం బలరాం పోటీకి దిగడం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు.

AP Assembly Elections 2019, Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Chirala MLA, Parchur MLA, TDP MLA Candidates, Amanchi Krishna Mohan, Karanam Balaram, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు, చీరాల అసెంబ్లీ, దగ్గుబాటి హితేష్ చెంచురాం, పర్చూరు అసెంబ్లీ
ఆమంచి కృష్ణమోహన్, చంద్రబాబు(File)


ఆమంచి కృష్ణమోహన్ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన్ను బుజ్జగించేందుకు కరణం బలరాం వెళ్లారు. అయినా, ఆమంచి పార్టీ మారారు. కరణం బలరాంను చీరాలకు పంపడం ద్వారా చంద్రబాబుకు రెండు సమస్యలు తీరనున్నాయి. అద్దంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవికి కరణం బలరాం వర్గాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉంది. గొట్టిపాటి రవి వైసీపీలో నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన తర్వాత.. కరణం బలరాం టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చంద్రబాబు బుజ్జగించారు.

AP Assembly Elections 2019, Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Chirala MLA, Parchur MLA, TDP MLA Candidates, Amanchi Krishna Mohan, Karanam Balaram, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు, చీరాల అసెంబ్లీ, దగ్గుబాటి హితేష్ చెంచురాం, పర్చూరు అసెంబ్లీ
కరణం బలరాం(ఫైల్ ఫోటో)


కరణం బలరాంను చీరాల బరిలో దించడం ద్వారా అటు గొట్టిపాటి నుంచి ఎలాంటి సమస్య రాదు. ఇటు ఆమంచి కృష్ణమోహన్ మీద గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి బరిలోకి దిగుతున్నారని టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపినట్టు అవుతుందని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వారు వైసీపీలో చేరారు. దగ్గుబాటి ఫ్యామిలీని ఢీకొట్టడానికి స్థానిక నేత, వ్యాపారవేత్త అయిన ఏలూరు సాంబశివరావును చంద్రబాబు తెరపైకి తెచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 23, 2019, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading