Home /News /politics /

CHANDRABABU NAIDU FACING THAT PROBLEM IN CHITTOOR DISTRICT AND TRYING HIMSELF FOR TDP VICTORY IN KUPPAM AK

Chandrababu Naidu: చంద్రబాబుకు ఆ లోటు కనిపిస్తోందా ? అందుకే కష్టపడాల్సి వస్తోందా ?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే గెలుపొందారు. దీంతో జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు కూడా సైలెంట్ అయ్యారు.

    రాజకీయాల్లో పార్టీ అధినేతలు, ముఖ్యనేతలు కేవలం వ్యూహాలను సిద్ధం చేయడానికి మాత్రమే పరిమితమవుతుంటారు. వాటికి క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అనేకమంది నేతలు పార్టీల్లో ఉంటారు. ప్రత్యర్థి పార్టీలకు చెక్ చెప్పేందుకు వ్యూహాలను సిద్ధం చేసి.. వాటిని అమలు చేసేందుకు కొందరు నేతలను రంగంలోకి దించుతుంటారు పార్టీ అధినేతలు. అయితే ఏపీలోని టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం తన వ్యూహాలను అమలు చేసే నేతలు కరువయ్యారేమో అనే చర్చ జరుగుతోంది. టీడీపీలో అనేక మంది సమర్థవంతమైన నేతలు ఉన్నారు. అయితే పార్టీ ఓటమి తరువాత వారిలో చాలామంది సైలెంట్ అయిపోయారు. వైసీపీని విమర్శించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడంలో మాత్రం ఈ నేతలు విఫలమవుతున్నారనే వాదన ఉంది.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండటమే మంచిదనే భావనలో ఎక్కువగా నేతలు ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ పరిస్థితి బాగా దెబ్బతింది. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా అధికార వైసీపీ తమకు అనుకూలమైన ఫలితాలు సాధిస్తోంది. త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. అక్కడ కూడా పాగా వేసి చంద్రబాబుకు పెద్ద షాక్ ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగి పని చేస్తున్నారు. ఆయనపై స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించడం మరో విశేషం.

    వైసీపీ ప్లాన్ గమనించిన చంద్రబాబు.. కుప్పంలో టీడీపీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని.. ఒకరకంగా చెప్పాలంటే ఆయనే స్వయంగా రంగంలోకి దిగారని వార్తలు వస్తున్నాయి. నిజానికి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యూహాలను అమలు చేసే నాయకులెవరూ పెద్దగా కనిపించడం లేదు.

    త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

    టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

    గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే గెలుపొందారు. దీంతో జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. ఈ ప్రభావం ఇప్పుడు చంద్రబాబుకు బాగా కనిపిస్తోందని.. కుప్పంలో ఆయన వ్యూహాలను అమలు చేసే సమర్థవంతమైన నేతలు కూడా టీడీపీలో కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకే కుప్పంలోని స్థానిక నేతలపైనే చంద్రబాబు ఎక్కువగా ఆధారపడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి టీడీపీలోని ముఖ్యనేతలు, కీలక నాయకులు సైలెంట్‌గా ఉండటం ఒకరకంగా చంద్రబాబుకు ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు