కోడెల హెల్త్ అప్ డేట్.. అల్లుడికి చంద్రబాబు ఫోన్..

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శివప్రసాదరావు అల్లుడు పూనాటి మనోహర్‌కు ఫోన్ చేశారు.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంకా కోలుకోలేదు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ తెలిపారు. కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మనోహర్‌కు ఫోన్ చేశారు. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం కారణంగా గుండెపోటు వచ్చిందని మనోహర్ తెలిపారు. గతంలో ఒకసారి కోడెలకు గుండెపోటు వచ్చిందని అయితే అప్పుడు స్టంట్ వేశామని చెప్పారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబుకు మనోహర్ వివరించారు. 48 గంటలు గడిచిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే యాంజియోగ్రామ్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కోడెలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అవసరమైతే హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు తరలించాలని డాక్టర్ మనోహర్ కు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం గుంటూరులోని శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూ లో కోడెలకు చికిత్స జరుగుతోంది. కోడెల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న గుంటూరు , నరసరావుపేట ,సత్తెనపల్లి పార్టీ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కోడెల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
    First published: