నేడే ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష..

Chandrababu Naidu Dharma Porata Deeksha : దీక్ష కోసం టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దీక్షకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించేలా ఢిల్లీలో పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: February 11, 2019, 6:50 AM IST
నేడే ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష..
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: February 11, 2019, 6:50 AM IST
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. కేంద్రం నుంచి ఏపీ ఎదుర్కొంటున్న వివక్షపై జాతీయ స్థాయిలో చర్చకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. దీక్ష కోసం ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న సీఎం.. సోమవారం ఉదయం 8గంటలకు ఏపీ భవన్‌లో దీక్షకు దిగబోతున్నారు. దీక్షకు ముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లకు నివాళులు అర్పించనున్నారు. రాత్రి 8గంటల వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. జాతీయ స్థాయిలో విపక్ష నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపే అవకాశం ఉంది.

దీక్ష కోసం టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దీక్షకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించేలా ఢిల్లీలో పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 7వేల మందికి పైగా జనాన్ని దీక్ష కోసం తరలిస్తున్నట్టు సమాచారం. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నేడు ఢిల్లీలోనే గడపనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో దీక్షకు హాజరయ్యేవారి కోసం ఇప్పటికే 800 గదులు, 60 బస్సులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అలాగే వారందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దీక్ష మరుసటి రోజైన మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామిల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...