రూలర్‌తో చంద్రబాబు మైండ్ గేమ్... బాలయ్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ యాక్షన్ అద్భుతంగా చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊహించని ఎత్తు వేశారు.

news18-telugu
Updated: December 15, 2019, 9:03 PM IST
రూలర్‌తో చంద్రబాబు మైండ్ గేమ్... బాలయ్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
చంద్రబాబు ,బాలకృష్ణ(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ యాక్షన్ అద్భుతంగా చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊహించని ఎత్తు వేశారు. అందుకు నందమూరి బాలయ్య కొత్త సినిమా రూలర్‌ను ఆయుధంగా చేసుకున్నారు. రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ విశాఖలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. నిన్న జరిగిన వేడుకకు విశాఖలోని టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, బయటకు ఇది పక్కా సినిమా ఫంక్షన్‌లా కనిపించినా, దీని వెనుక అసలు సిసలైన రాజకీయ వ్యూహం ఉందని టీడీపీ నేతలు బయటపెట్టారు.

విశాఖలో జరిగిన రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం స్టిల్స్


గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధహవుతోంది. జనవరి నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత ఫిబ్రవరిలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకోసం విశాఖలో భారీ ఎత్తున అభివృద్ధి పథకాలకు జగన్ శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టడానికి, టీడీపీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా రూలర్ సినిమా ఫంక్షన్‌ను విశాఖలో ఏర్పాటు చేయించినట్టు తెలిసింది.

విశాఖలో జరిగిన రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం స్టిల్స్
ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా, విశాఖ నగరంలో మాత్రం సైకిల్ జోరు కొనసాగింది. విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంది. దీంతో ఈసారి వైజాగ్ మున్సిపాలిటీ మీద వైసీపీ జెండా ఎగరేసి గత ఎన్నికల్లో నష్టపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో విశాఖ మీద తమకు ఉన్న పట్టును నిలబెట్టుకుని, జీవీఎంసీని సొంతం చేసుకోవడం ద్వారా జగన్‌కు భారీ ఝలక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉన్న అస్త్రాలను ప్రయోగిస్తుంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇలా బాలయ్య రూపంలో అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని, టీడీపీ కేడర్‌లో జోష్ నింపడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు