గ్రామ సచివాలయం పరీక్షల్ని రద్దు చేయండి : చంద్రబాబు

దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలన్నారు చంద్రబాబు.

news18-telugu
Updated: September 22, 2019, 8:43 AM IST
గ్రామ సచివాలయం పరీక్షల్ని రద్దు చేయండి : చంద్రబాబు
గ్రామ సచివాలయం పరీక్షల్ని రద్దు చేయండి : చంద్రబాబు
  • Share this:
ఏపీలో గ్రామ సచివాలయం ఉద్యోగుల పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పరీక్ష పేపర్ లీకులపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ విమర్శల వేగం పెంచింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయ నియామకం ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలంటున్నారు. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చిందని ఆరోపించారు చంద్రబాబు. ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయి? అంటూ ప్రశ్నించారు. దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకం ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి. దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.#YSJaganFailedCM#YcpPaperLeakScam


First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు