వైఎస్ జగన్ ముందు చంద్రబాబు కొత్త డిమాండ్

రుణమాఫీపై న్యాయపరమైన హక్కు ఉన్నందున రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు.. చంద్రబాబుకు సూచించారు.

news18-telugu
Updated: June 17, 2019, 8:53 PM IST
వైఎస్ జగన్ ముందు చంద్రబాబు కొత్త డిమాండ్
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 17, 2019, 8:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఓ కొత్త డిమాండ్ ఉంచారు. వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు భరోసా రబీ నుంచి అమలు చేస్తామని ప్రకటించినందున.. ఖరీఫ్‌‌లో రైతులకు ఉపయోగపడేలా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారబోవన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ అంశంపై కూడా చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వం వస్తే రుణమాఫీ కూడా అమలవుతుందని రైతులు ఆశించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ 4, 5 విడుతలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనన్నారు. రుణమాఫీపై న్యాయపరమైన హక్కు ఉన్నందున రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు.. చంద్రబాబుకు సూచించారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారవన్న చంద్రబాబు యూపీఏ తీసుకొచ్చిన నరేగా పథకాన్ని ఎన్డీయే కొనసాగించిందని చెప్పారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...