చంద్రబాబు కీలక నిర్ణయం... ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సంప్రదింపులు ?

రాబోయే ఎన్నికల్లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 14, 2019, 2:09 PM IST
చంద్రబాబు కీలక నిర్ణయం... ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సంప్రదింపులు ?
చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిశోర్ (File)
  • Share this:
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసిన టీడీపీలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ సమీక్షా సమావేశం సందర్భంగా పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు... మళ్లీ పార్టీని గెలిపించుకోవడం ఎలా అనే దానిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ విజయానికి కీలకంగా భావించే నవరత్నాల పథకాల రూపకల్పన చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్... జగన్ పాదయాత్ర, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక సహా అనేక అంశాల్లో కీలక భూమిక పోషించింది.

ఎన్నికలతో వైసీపీకి పీకే టీమ్‌కు ఉన్న కాంట్రాక్ట్ ముగిసిందని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే ప్రశాంత్ కిశోర్ బృందంతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఈ మేరకు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొందరు టీడీపీ ముఖ్యనేతలు సైతం ఈ మేరకు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో పీకే టీమ్ సేవలందించిన వైసీపీ అఖండ విజయం సాధించడంతో... పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ సైతం ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి.First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>