మళ్లీ తెలంగాణపై చంద్రబాబు ఫోకస్... కారణం ఇదే ?

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 18, 2019, 3:57 PM IST
మళ్లీ తెలంగాణపై చంద్రబాబు ఫోకస్... కారణం ఇదే ?
చంద్రబాబు
  • Share this:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీ టీడీపీలో కొత్త కమిటీలు వేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ కొనసాగుతున్నారు. తెలంగాణలోని టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ... ఇప్పటికే అనేక జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షులను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇక తెలంగాణలో జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించకుండా... లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో పాటు టీటీడీపీకి కొత్తగా ఇద్దరు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి లేదా వీరేందర్ గౌడ్‌లలో ఇద్దరికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కొచ్చని టాక్. టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి కూడా త్వరలోనే పార్టీలో కీలక పదవి దక్కతుందని సమాచారం. అయితే చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయడం వెనుక అసలు కారణం గ్రేటర్ ఎన్నికల్లో అనే వాదనలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం చూపిస్తే... మళ్లీ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న టీడీపీ అధినేత... ఈ శనివారం హైదరాబాద్ వచ్చిన తరువాత టీటీడీపీ నేతలతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
First published: September 18, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading