ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి చంద్రబాబు దూరం ?

ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోయే అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 18, 2019, 4:34 PM IST
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి చంద్రబాబు దూరం ?
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 18, 2019, 4:34 PM IST
ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీతో ఢీ అంటే ఢీ అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఎన్నికల తరువాత బీజేపీని విమర్శించే విషయంలో కొంత వెనక్కి తగ్గారు. దీంతో మళ్లీ ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోయే అఖిలపక్ష సమావేశానికి వెళ్లే అవకాశం వచ్చినా... దానికి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి పలు కీలక అంశాలపై చర్చించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా లేదా అనే అంశంపై టీడీపీ వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై టీడీపీలో తర్జన భర్జన కొనసాగిందని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న గల్లా జయదేవ్‌గా పంపాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.


First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...