ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఫస్ట్ టార్గెట్ టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. చంద్రబాబును రాజకీయంగా దెబ్బకొడితే.. టీడీపీ భారీగా దెబ్బతింటుందన్నది వైసీపీ వ్యూహం. ఇందులో భాగంగానే చంద్రబాబు కంచుకోటగా ఉంటూ వస్తున్న కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు వ్యూహరచన చేసిన వైసీపీ.. అందులో విజయం సాధించింది. కుప్పంలో మెజార్టీ వార్డులను గెలుచుకుని కుప్పం మున్సిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగిరేలా చేయడంలో విజయం సాధించింది. ఈ పరిణామం చంద్రబాబుపై బాగానే పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంను వదిలిపెట్టి.. చంద్రబాబు మరో నియోజకవర్గం చూసుకోవాలని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం సీటును కూడా తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కుప్పంపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. కుప్పం మున్సిపాలిటీలో పోటీ చేసిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన మొదలుపెడతానని చెప్పిన చంద్రబాబు.. ఇకపై నెలకోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని వారికి చెప్పినట్టు సమాచారం. ఇవన్నీ ఎలా ఉన్నా.. చంద్రబాబు కుప్పం విషయంలో తీసుకున్న మరో నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది.
కొన్ని దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు. ఈ విషయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో.. త్వరలోనే కుప్పంలో సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకుంటానని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు హైదరాబాద్‌లో సొంతిల్లు ఉంది. ఇక ఆయన సొంతూరైన చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలోని నారావారిపల్లెలో ఆయనకు ఇల్లు ఉంది.
TRSలో ఆ పదవులు ఎవరికి ? KCR లెక్క ఏంటి ?.. భారీగా ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలు
KCR వ్యూహాలకు కౌంటర్ రెడీ.. రంగంలోకి దిగిన Amit Shah.. ఆ ఏడుగురు నేతలకు పిలుపు
ప్రతి ఏడాది సంక్రాంతిని ఆయన అక్కడే జరుపుకుంటారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు.. అక్కడ సొంతిల్లు కట్టుకోలేదు. ఈ అంశంపై వైసీపీ కూడా పదే పదే విమర్శలు చేస్తుంటుంది. అయితే తాజాగా కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కుప్పంలో తన సత్తా చాటాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. అందుకే కుప్పం నుంచే పార్టీని పటిష్టం చేసుకోవడంపై ఫోకస్ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Kuppam, TDP