అదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది : జగన్‌కు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎందుకంతలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 13, 2019, 2:51 PM IST
అదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది : జగన్‌కు చంద్రబాబు వార్నింగ్
చంద్రబాబు, వైఎస్ జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయితీలు జరగనివ్వమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.అలాంటి పరిస్థితే గనుక వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ పాలన బాగుంటే ప్రతిపక్ష హోదాలో నిర్మాణత్మక పాత్ర పోషిద్దామనుకున్నానని.. కానీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నందునా పోరాటం తప్పదని అన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే.. ముందుకొచ్చి మద్దతునిస్తామని.. అందులో భాగంగానే కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు ఎక్కడా సాగడం లేదని.. దోచుకోవడానికే వైసీపీ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి నిర్మాణాన్ని ఆపేయడంతో.. రెండు నెలల్లోనే 20 విమాన సర్వీసులు రద్దయిపోయాయని అన్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లి విమానంలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎందుకంతలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్చ లేకుండా పోయిందని.. ప్రజా వేదిక కావాలని అడిగినందుకు కక్షతో దాన్ని కూల్చివేశారని ఆరోపించారు.ఇవే అరాచకాలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు