ఇవిగో ఆధారాలు.. జగన్ రాజీనామా చేస్తావా?.. చంద్రబాబు ప్రతి సవాల్.. రేపు నోటీస్

AP Assembly | టీడీపీ హయాంలో కూడా సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చినట్టు తమ వద్ద మూడు ఆధారాలు ఉన్నాయన్నారు. 2016 మార్చిలో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం వివరాలు ఆయన బయటపెట్టారు.

news18-telugu
Updated: July 11, 2019, 6:12 PM IST
ఇవిగో ఆధారాలు.. జగన్ రాజీనామా చేస్తావా?.. చంద్రబాబు ప్రతి సవాల్.. రేపు నోటీస్
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రతి సవాల్ విసిరారు. సున్నా వడ్డీ పథకం వైసీపీ కొత్తగా తీసుకొచ్చిందని.. గత టీడీపీ హయాంలో కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దానికి సంబంధించిన రికార్డులు బయటపెడితే చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో కూడా సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చినట్టు తమ వద్ద మూడు ఆధారాలు ఉన్నాయన్నారు. 2016 మార్చిలో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం వివరాలు ఆయన బయటపెట్టారు. ఆ పేపర్లు తీసుకుని వెళ్లేలోపు అసెంబ్లీని వాయిదా వేసుకుని వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని చంద్రబాబునాయుడు డిమాడ్ చేశారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి అసత్యాలతో తనకు సవాల్ విసిరారన్నారు. నేతలపై దాడులతో పొలిటికల్ టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు