ఓటమిపై స్పందించిన చంద్రబాబు.. జగన్‌కు అభినందనలు..

ఈనెల 30న విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 7:31 PM IST
ఓటమిపై స్పందించిన చంద్రబాబు.. జగన్‌కు అభినందనలు..
చంద్రబాబు నాయుడు(File)
news18-telugu
Updated: May 23, 2019, 7:31 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ కొట్టుకుపోయింది. మెజారిటీ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ పత్తా లేకుండా పోయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈక్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబునాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని కోరారు. మరోవైపు ఎన్నికల ఫలితాల మీద చంద్రబాబునాయుడు తొలిసారి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు అభినందనలు. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓట్లు వేసిన ప్రజలకు, ఆశీస్సులు అందించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుని తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలో నిర్ణయించుకుంటాం. ’ అని చంద్రబాబునాయుడు అన్నారు.

ఈనెల 30న విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...