ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ కొట్టుకుపోయింది. మెజారిటీ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ పత్తా లేకుండా పోయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈక్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబునాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని కోరారు. మరోవైపు ఎన్నికల ఫలితాల మీద చంద్రబాబునాయుడు తొలిసారి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు అభినందనలు. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓట్లు వేసిన ప్రజలకు, ఆశీస్సులు అందించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుని తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలో నిర్ణయించుకుంటాం. ’ అని చంద్రబాబునాయుడు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.