టీడీపీకి 120 సీట్లు ఖాయం... సర్వే ఉందన్న చంద్రబాబు

పార్టీ తరపున అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... ఎన్నికల్లో గెలుపు తమదే అని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 18, 2019, 6:41 PM IST
టీడీపీకి 120 సీట్లు ఖాయం... సర్వే ఉందన్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు (File)
news18-telugu
Updated: April 18, 2019, 6:41 PM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 120 సీట్లు ఖాయమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తరపున అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... ఎన్నికల్లో గెలుపు తమదే అని వ్యాఖ్యానించారు. సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేసిన తరువాతే తాను ఈ విషయం చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 22న పార్టీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులందరితో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎన్నికల సరళి, పోలింగ్ జరిగిన తీరు గురించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకోనున్నారు చంద్రబాబు.

ఇప్పటికే పోలింగ్ తీరు పట్ల అనేకమంది టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వీటిపై సవివరంగా చర్చించాలని భావించిన చంద్రబాబు... అందరిలో ఒకేసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించడంతో... అంతకంటే ముందుగానే పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలని టీడీపీ అధినేత డిసైడయ్యారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనుమానమే అని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో... పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.


First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...