CHANDRABABU NAIDU CONFIDENCE OVER TDP VICTORY IN ANDHRAPRADESH ELECTION 2019 MS
చెప్తున్నా.. రాసుకోండి.. నూటికి వెయ్యి శాతం మేమే గెలవబోతున్నాం..: చంద్రబాబు
చంద్రబాబు
రాష్ట్రంలో సంక్షేమం, పార్టీ స్థితి గతులపై ఎప్పటికప్పుడు తాను ప్రజాభిప్రాయం సేకరిస్తూనే ఉన్నానని.. ప్రజలంతా పార్టీ వైపే ఉన్నారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గడిచిన ఐదేళ్లలో చేసిన సంక్షేమ-అభివృద్ది కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చేయలేదన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం తామే గెలవబోతున్నామని.. తన మాట రాసి పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ టీడీపీయే మళ్లీ అధికారం చేపట్టబోతున్నాయని స్పష్టంగా చెప్పాయన్నారు.తాను ఇచ్చిన పిలుపుతో లక్షలాది మంది ఓటర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటు వేశారని చంద్రబాబు అన్నారు. మరుసటి రోజు ఉదయం 4గం. వరకు లైన్లో నిలబడి మరీ ఓపిగ్గా ఓటు వేశారని చెప్పారు. సర్వేలు చేయించుకోవడం ప్రస్తుతం అందరికీ ఓ అలవాటుగా మారిపోయిందని..తెలుగుదేశం పార్టీ 1985ల నుంచి 35 ఏళ్లుగా సర్వేలు చేయిస్తూనే ఉందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, పార్టీ స్థితి గతులపై ఎప్పటికప్పుడు తాను ప్రజాభిప్రాయం సేకరిస్తూనే ఉన్నానని.. ప్రజలంతా పార్టీ వైపే ఉన్నారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గడిచిన ఐదేళ్లలో చేసిన సంక్షేమ-అభివృద్ది కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చేయలేదన్నారు.
ఈవీఎంల వల్ల ఓటింగ్ ప్రక్రియ వేగవంతంగా ఉండవచ్చు గానీ వేగం కంటే విశ్వసనీయత ముఖ్యం అన్నారు. వీవీప్యాట్స్‌లో 50% ఓట్లను లెక్కించాలన్న తన డిమాండ్‌కు అందరూ ఒప్పుకుంటున్నారని చెప్పారు. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో వచ్చే స్లిప్‌ను ఓటరే స్వయంగా పరిశీలించి తిరిగి దాన్ని బ్యాలెట్ బాక్స్‌లో వేసే పద్దతి రావాలన్నారు. తద్వారా ఎన్నికల్లో పారదర్శక పెరుగుతుందన్నారు.వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించమంటే బీజేపీకి నచ్చడం లేదన్నారు. తాము పట్టుబట్టి డిమాండ్ చేశాకే వీవీప్యాట్లు వచ్చాయని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్స్ లెక్కించాలని ఇప్పటికీ 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయని గుర్తుచేశారు. ఈవీఎంలపై పోరాటంలో త్వరలోనే ఢిల్లీలో ఒక ఉమ్మడి కార్యాచరణ చేపడుతామని చెప్పారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.