టీడీపీ మహానాడు ప్రారంభం... ఎల్జీ పాలిమర్స్ బాధితులకు సంతాపం

TDP Mahanadu 2020: ముందుగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మృతులకు సంతాపం ప్రకటించిన మహానాడు... బాధితులకు పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు.

news18-telugu
Updated: May 27, 2020, 12:38 PM IST
టీడీపీ మహానాడు ప్రారంభం... ఎల్జీ పాలిమర్స్ బాధితులకు సంతాపం
మహానాడులో ప్రసంగిస్తున్న చంద్రబాబు
  • Share this:
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు కార్యక్రమం మొదలైంది. కరోనా కారణంగా ఈ ఏడాది వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మహానాడు నిర్వహిస్తున్నారు. ముందుగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మృతులకు సంతాపం ప్రకటించిన మహానాడు... బాధితులకు పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన లాక్‌డౌన్ వల్ల విశాఖ సందర్శించలేకపోయానని చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరగగానే విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరానని తెలిపారు. గతంలో అనుమతి రానందునే విశాఖ వెళ్లలేకపోయానని వివరించారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా గ్యాస్ లీక్ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు ఆరోపించారు. బాధితులకు అండగా ఉన్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం ఏమిటని చంద్రబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
First published: May 27, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading