ఆధారాలతో అవినీతిని వెలికితీయండి.. దాడులు కొనసాగుతున్నాయన్న చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చేశారని.. విజయవాడలో పట్టాభి కారు ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

news18-telugu
Updated: October 6, 2020, 5:28 PM IST
ఆధారాలతో అవినీతిని వెలికితీయండి.. దాడులు కొనసాగుతున్నాయన్న చంద్రబాబు
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
రాష్ట్రంలో కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే.. వైసీపీ నాయకులు మాత్రం అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో రూ 4వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. లెవలింగ్ పేరుతో రూ 2వేల కోట్ల నరేగా నిధులు స్వాహా చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ స్కామ్‌లు బయటపెట్టాలని పిలుపునిచ్చారు. బెంజ్ మినిస్టర్ జయరామ్ భూముల కబ్జాపై సాక్ష్యాధారాలతో అయ్యన్నపాత్రుడు రుజువు చేశారన్న చంద్రబాబు... అదేవిధంగా ప్రతి మంత్రి, వైసిపి ఎమ్మెల్యేల అవినీతిని డాక్యుమెంట్ ఎవిడెన్స్‌లతో సహా ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేసే విషయంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని.. బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపీ ఫైట్స్ కరోనా’’ వెబ్ సైట్ ప్రారంచామని చంద్రబాబు అన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా విపత్తుల్లో బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదన్న చంద్రబాబు.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనం ఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు. మూడు నెలల్లో మూడు జిల్లాలలో ముగ్గురికి శిరోముండనం చేయడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చేశారని.. విజయవాడలో పట్టాభి కారు ధ్వంసం చేశారని ఆరోపించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు దుర్భాషలను ప్రజల్లో ఎండగట్టాలని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాలు, వరదలకు 3లక్షల 20వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని... వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ బిల్లుల అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 6, 2020, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading