Chandrababu Naidu: జగన్ అలా చేస్తే.. రాష్ట్రానికే అరిష్టమన్న చంద్రబాబు

Chandrababu Naidu: చట్టపరంగా ఎన్నికైన సీఎం చట్ట ఉల్లంఘనలు చేయరాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 22, 2020, 8:00 PM IST
Chandrababu Naidu: జగన్ అలా చేస్తే.. రాష్ట్రానికే అరిష్టమన్న చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్
  • Share this:
సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాత తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అన్యమతస్థుడైన దేశాధ్యక్షుడే డిక్లరేషన్ ఇచ్చారని.. కేంద్రమంత్రులు కూడా డిక్లరేషన్ ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని అన్నారు. సీఎం వైఎస్ జగన్ తిరుమల ఆలయంలోకి వెళ్లే ముందు ఆయన డిక్లరేషన్ సమర్పించేలా పట్టుబట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలిస్తే ఆయనతో పాటు రాష్ట్రానికే అరిష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అన్యమత ఆచారాలను కించపర్చరాదని... ఇతర మతాలను చులకన చేయరాదని అన్నారు. చట్టపరంగా ఎన్నికైన సీఎం చట్ట ఉల్లంఘనలు చేయరాదని పార్టీలో నేతలతో చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ చట్టాన్నే తీసేస్తామని మంత్రి, బోర్డు ఛైర్మన్‌లతో చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఏ స్థాయిలో వారైనా దోషులే అని..బాధ్యతగల ముఖ్యమంత్రి చట్ట ఉల్లంఘనలకు పాల్పడరాదని చంద్రబాబు అన్నారు. దేవుడి పట్ల వైసీపీ చేసే అపచారాలకు టీడీపీ శ్రేణులు నిరసనలు తెలపాలని టీడీపీ అధినేత సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు జరపాలని ఆదేశించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 22, 2020, 8:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading