వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తాం... టీడీపీ గేర్ మారాలన్న చంద్రబాబు

ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని చంద్రబాబు దుయ్యబట్టారు.

news18-telugu
Updated: June 10, 2020, 3:25 PM IST
వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తాం... టీడీపీ గేర్ మారాలన్న చంద్రబాబు
ఓం ప్రతాప్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
  • Share this:
దశాబ్దాలుగా కొందరు టీడీపీలో పదవులు పొందారని... అలాంటి వాళ్లు ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలా పార్టీ మారినవారు కనుమరుగయ్యారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఇక టీడీపీ గేర్ మార్చాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నమ్మించి ద్రోహం చేశారని మండిపడ్డారు.

ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏడాది గడిచినా బాబాయి హత్య కేసు, కోడి కత్తి కేసుపై చర్యలు లేవని వ్యాఖ్యానించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, తప్పుడు కేసులతో ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: June 10, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading