జగన్ అలా చేస్తే... ఏం చేస్తానో చెప్పిన చంద్రబాబు

మండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... కేంద్రం దాన్ని తిరస్కరించే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: January 24, 2020, 5:38 PM IST
జగన్ అలా చేస్తే... ఏం చేస్తానో చెప్పిన చంద్రబాబు
సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు(File Photos)
  • Share this:
ఏపీలో శాసనమండలి రద్దయ్యే అవకాశమే లేదని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎమ్మెల్సీలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... కేంద్రం దాన్ని తిరస్కరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ శాసనమండలిని రద్దు చేసినా... తాము అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని తాను సూచించానని తెలిపారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మూడు రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. బేరసారాలు, బెదిరింపుల కోసమే సభకు గ్యాప్ ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్సీలకు ఖాళీ స్థలాలు, ఇళ్లు ఇస్తామని ప్రలోభాలు పెట్టారని అన్నారు. అయితే వాళ్లు ఎన్ని చేసినా తమ ఎమ్మెల్సీలు లొంగలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు