పోలీసులు ఎక్స్‌ట్రాలు చేయొద్దు... చంద్రబాబు విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: October 10, 2019, 1:48 PM IST
పోలీసులు ఎక్స్‌ట్రాలు చేయొద్దు... చంద్రబాబు విమర్శలు
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలోని పోలీసులు టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను విశాఖ వస్తే స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది పోలీసులు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ సమావేశం దగ్గర కూడా కొందరు పోలీసులు ఎక్స్‌‌ట్రా వేషాలు వేస్తున్నారని విమర్శించారు. తనకు ప్రతి ఒక్కరి జాతకం తెలుసన్న చంద్రబాబు... తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఓ రౌడీ గవర్నమెంట్ నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలంతా ఈ విషయాన్ని నిరూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ కూడా భయపడేవారని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ డీజీపీ పట్టించుకోలేదని ఆరోపించారు. అదే వైసీపీ నేతలు వెళ్తే మాత్రం వారికి రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. ఎవరేం చేస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఓ నేరస్తుడని.. ఆ నేరస్తుడు చెబితే మీరు రెచ్చిపోతారా ? అంటూ పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. అవసరమైతే పోలీసులు వైసీపీలో చేరి పోటీ చేయాలని అన్నారు.


First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>