• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CHANDRABABU NAIDU COMMENTS ON AP GOVERNMENT ON CORONA VIRUS PREVENTION MEASURES AK

‘జగన్ సర్కార్‌కు రాజకీయాలే ముఖ్యం’

‘జగన్ సర్కార్‌కు రాజకీయాలే ముఖ్యం’

అయితే ఆ తరువాత అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో వివాదం చెలరేగింది.

కరోనా వైరస్ టెస్టింగ్‌ కిట్లపై కూడా వైసీపీ నేతలు కక్కుర్తి పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

  • Share this:
    ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటే.. వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీలోని 11 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని... కరోనా వివరాలు దాచిపెట్టడం తప్పని ముందు నుంచీ చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతో ప్రజలు భయపడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

    సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టెస్టింగ్‌ కిట్లపై కూడా వైసీపీ నేతలు కక్కుర్తి పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎక్కువ ధరకు సౌత్‌ కొరియా నుంచి టెస్ట్‌ కిట్లను తెప్పించుకున్నారని.. పట్టుబడిన తర్వాత ధర తగ్గించుకుంటామని చెబుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. కేరళ మాదిరిగా ఎందుకు నిత్యావసర సరుకులను ఇవ్వలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారని.. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన ఎలా తిరుగుతారని చంద్రబాబు ప్రశ్నించారు. హాట్‌స్పాట్లలో వైసీపీ నేతలు పర్యటించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఓ ఎమ్మెల్యే పూలవర్షం కురిపించుకున్నారని పరోక్షంగా రోజాపై విమర్శలు గుప్పించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు