వైఎస్ అలా ఆలోచిస్తే... హైదరాబాద్‌లా కాదన్న చంద్రబాబు

అమరావతిని చంపేసి... ఏపీకి రాజధాని లేకుండా చేశారని వ్యాఖ్యనించారు. టీడీపీని దెబ్బతీయాలని చూస్తే రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేస్తామని శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో అన్నారు.

news18-telugu
Updated: October 22, 2019, 7:47 PM IST
వైఎస్ అలా ఆలోచిస్తే... హైదరాబాద్‌లా కాదన్న చంద్రబాబు
వైఎస్ఆర్, చంద్రబాబు
news18-telugu
Updated: October 22, 2019, 7:47 PM IST
ఏపీలో వైసీపీ తీరు దుర్మార్గంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. మంచి నగరాన్ని నిర్మించాలనే ప్రయత్నాన్ని చంపేశారని ఆయన ఆరోపించారు. తన మార్కు లేకుండా ఉండేందుకే అమరావతి లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ రోజు వైఎస్ అలా చేస్తే హైదరాబాద్ ఉండేదా ? అని ప్రశ్నించారు. అమరావతిని చంపేసి... ఏపీకి రాజధాని లేకుండా చేశారని వ్యాఖ్యనించారు. టీడీపీని దెబ్బతీయాలని చూస్తే రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేస్తామని శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో అన్నారు. వైసీపీవి రివర్స్ టెండర్లు కాదని... రిజర్వ్ టెండర్లని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ గ్రౌండ్ సిటీ అని అమరావతి గ్రీన్ సిటీ అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో వర్షం పడితే డ్రైన్లు పొంగుతాయన్న చంద్రబాబు... అమరావతిలో ఏ సమస్యా తలెత్తదని అన్నారు. అమరావతి ప్రస్తుతం కొన ఊపిరితో ఉందన్నారు. తనకున్న విశ్వసనీయతను సింగపూర్ ప్రభుత్వం గుర్తించిందని, తనపై నమ్మకంతో ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ ఇచ్చిందన్నారు. నాలుగేళ్లలో 11 శాతం గ్రోత్ రేట్ పెంచిన ఘనత తమదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిందని చంద్రబాబు విమర్శించారు. తనకు డీజీపీ రూల్స్ నేర్పిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడే బాధ్యత టీడీపీపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...