Home /News /politics /

CHANDRABABU NAIDU CLARIFIES TO TDP LEADERS ON NARA LOKESH ROLE IN TDP AK

లోకేశ్‌పై నేతల ఫిర్యాదు... చంద్రబాబు ఏమన్నారంటే...

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

Nara lokesh | లోకేశ్‌ నిర్ణయాలు, ఆయన చుట్టూ ఉన్న వారిపై కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా పార్టీకి కొంతవరకు నష్టం చేసిందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

    ఏపీలో పార్టీ ఓటమి కారణంగా అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఓ వైపు తమ పార్టీ నేతలను ఆకర్షించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో... వాళ్లు పార్టీ మారకుండా చూడటం చంద్రబాబుకు అతిముఖ్యమైన అంశంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన కాపు నేతలు బీజేపీ వైపు చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు... సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కాపు నేతలు సోమవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీ ఓటమిపై కారణాలను చంద్రబాబుకు వివరించిన పలువురు నేతలు... ఈ క్రమంలో లోకేశ్‌ తీరుపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

    లోకేశ్‌ నిర్ణయాలు, ఆయన చుట్టూ ఉన్న వారిపై కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా పార్టీకి కొంతవరకు నష్టం చేసిందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన చంద్రబాబు... ఇకపై పార్టీ మొత్తాన్ని తానే చేసుకుంటానని వారికి స్పష్టం చేశారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా... నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరం కలిసి టీమ్ వర్క్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన నేతలకు సూచించారు. ఇకపై ఏ నిర్ణయమైనా అందరిలో చర్చించే తీసుకుందామని వివరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు