ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతులపై చర్చకు సిద్ధం: చంద్రబాబు

చంద్రబాబునాయుడు (File)

పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Share this:
    ఎల్జీ పాలిమర్స్‌ అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క ఎకరా కేటాయించలేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ హయాంలో 4 సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కంపెనీకి ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో ఆధారాలు ఉన్నాయన్న చంద్రబాబు... వాటిపై చర్చకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

    ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక వైసీపీ హస్తం లేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్జీటీ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్‌ సుప్రీంకు వెళ్లడం వెనుక వైసీపీ హస్తముందని ఆయన ఆరోపించారు. పరిహారాన్ని కంపెనీ ద్వారా ఇప్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చారని చంద్రబాబు తప్పుబట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: