రాజీనామా చేస్తా... సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్

హెరిటేజ్ సంస్థలో తనకు వాటాలు ఉన్నాయని రుజువు చేస్తే... తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 1:31 PM IST
రాజీనామా చేస్తా... సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
జగన్, చంద్రబాబు
  • Share this:
వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదికాదని... అమ్మేశామని ఇదివరకే చెప్పామని చంద్రబాబు అన్నారు. అయినా హెరిటేజ్ మాదే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ మాదే అని రుజువు చేస్తే... తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అలా రుజువు చేయలేకపోతే సీఎం జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. తాను చేసిన సవాల్‌ను ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు స్వీకరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదే పదే ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: December 10, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading